కుభీర్ : దేశ పురోగతిలో మహిళల పాత్ర ( Womens role ) అత్యంత కీలకమని సామాజిక సేవకురాలు అనురాధ ( Anuradha) అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రం లోని సరస్వతి శిశు మందిర్ ఆవరణలో నారీ సప్త శక్తి సంఘం కార్యక్రమంలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు.
మహిళలు విద్య, ఆరోగ్యం, ఆర్థిక, రాజకీయ, కుటుంబ, రక్షణ వంటి అన్ని రంగాల్లో భాగస్వాములుగా ఉంటూ కుటుంబం నుండి ప్రభుత్వం వరకు సానుకూల మార్పులకు మహిళలు ఎంతగానో దోహదపడు తున్నారని అన్నారు. దేశం సంపూర్ణంగా పురోగమిం చాలంటే మహిళా సాధికారత తప్పనిసరని అన్నారు.
రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం, స్థానిక సంస్థలు, పార్లమెంటులో వారి సంఖ్య పెరగడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. సంఘ సంస్కరణల ద్వారా సామాజిక దురాచారాలను నిర్మూలించి, సమాజంలో సమాన హక్కుల కోసం పోరాడే చైతన్యానికి మహిళలు నాయకత్వం వహించాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో హైస్కూల్ తెలుగు పండిత్ వాణి, రెడ్డి శెట్టి సునీత, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమ నేత పుప్పాల పీరాజీ, ప్యాట లక్ష్మణ్, శ్రీనివాస్, దత్తాత్రి, ఈర్ల హనుమాన్లు, మహిళలు పాల్గొన్నారు.