KTR | మంత్రి జూపల్లి కృష్ణారావు అవకాశవాది : కేటీఆర్
KTR | మంత్రి జూపల్లి కృష్ణారావు అవకాశవాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ : మంత్రి జూపల్లి కృష్ణారావు అవకాశవాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్‌పై జూపల్లి పొగడ్తల వర్షం కురిపించేవాడని, పాలమూరుకు దేవుడు కేసీఆర్ అని చెప్పేవాడని కేటీఆర్ గుర్తుచేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మనం టికెట్ ఇవ్వకపోతే జూపల్లి పొయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరిండని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు అక్కడ తన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం కేసీఆర్‌పై నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నడని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతున్నడని చెప్పారు. రేవంత్‌రెడ్డి దేవుడు అంటున్నడని, ఆయన ఎవరికి దేవుడు..? అని ప్రశ్నించారు.
మంత్రి జూపల్లి అవకాశవాదంతో తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయి, తనను నమ్ముకున్న ప్రజలను, రైతులను మోసం చేసిండని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయితుంటే రైతులకు ఒకే ఒక్కసారి రైతు భరోసా డబ్బులు వేసిండ్రని చెప్పారు. యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

