
హిమాయత్‌నగర్/సుల్తాన్‌బజార్, డిసెంబర్1 : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ పోరాటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ అన్నారు. పోలీస్ కిష్టయ్య 12వ వర్ధంతి సందర్భంగా బుధవారం హిమాయత్‌నగర్ నుంచి గన్‌పార్కు వద్దనున్న అమరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కిష్టయ్య చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, సమన్వయకర్త శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, నాయకులు రంజిత్, సాయిరాజ్, నర్సింహ, కనకయ్య, రమేశ్, చింతల ప్రకాశ్, నాగమణి, ఉషారాణి, సురేశ్, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా.. టీఆర్‌ఎంఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీలం సరస్వతి, సభ్యులు వరలక్ష్మి, నాగమణి, ఉష, ఉమారాణి, రేణుక, సంగీత, జగన్, వెంకటేశ్వర్ తదితరులు పోలీస్ కిష్టయ్యకు నివాళులర్పించారు.