పెళ్లెవరు చేసుకోమన్నారు?
“మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోమన్నారు..? పిల్లలు ఉంటే కేర్ టేకర్లో వేయండి.. ఉద్యోగాలు చేస్తున్న మహిళలను చేసుకుని స్పౌజ్ అంటూ వచ్చి ట్రాన్స్ఫర్లు అడగడం ఎందుకు..? అవేం కుదరదు.. హైదరాబాద్లోనే చేయాలి.. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు స్థానికంగా పనిచేస్తున్న కొందరు ఎస్ఐలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు. నగరంలో పనిచేస్తున్న కొందరు ఎస్ఐల పరిస్థితి దారుణంగా ఉంది.
- సిటీ కమిషనరేట్లో స్పౌజ్ల పంచాయితీ
- భార్య ఉద్యోగం చేసేచోట ట్రాన్స్ఫర్ అడుగుతున్న
- ఎస్ఐలపై ఉన్నతాధికారుల చిందులు
- ఎక్కువ మాట్లాడితే ‘కార్’కు అటాచ్ అంటూ వార్నింగ్
“మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోమన్నారు..? పిల్లలు ఉంటే కేర్ టేకర్లో వేయండి.. ఉద్యోగాలు చేస్తున్న మహిళలను చేసుకుని స్పౌజ్ అంటూ వచ్చి ట్రాన్స్ఫర్లు అడగడం ఎందుకు..? అవేం కుదరదు.. హైదరాబాద్లోనే చేయాలి.. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు స్థానికంగా పనిచేస్తున్న కొందరు ఎస్ఐలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు. నగరంలో పనిచేస్తున్న కొందరు ఎస్ఐల పరిస్థితి దారుణంగా ఉంది. తమ భార్యలు వేరే ప్రాంతాల్లో వేర్వేరు శాఖల్లో పనిచేస్తుండటంతో వారిద్దరు ఒకే దగ్గర కలిసి ఉండే పరిస్థితి లేదని దీంతో పిల్లల సంరక్షణ, కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోందంటూ హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఎస్ఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఒకేచోట పనిచేసే వెసులుబాటు కల్పించాలని కోరుతూ ఎస్ఐలు దరఖాస్తులు చేసుకోగా..ఉన్నతాధికారుల నుంచి నిర్లక్ష్యపు మాటలు ఎదురవుతున్నాయి”.
సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో పనిచేస్తున్న కొందరు ఎస్ఐల భార్యలు వివిధ డిపార్ట్మెంట్లలో నల్లగొండ, మెదక్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో పనిచేస్తున్నారు. ఆయా ఎస్ఐలకు సంబంధించిన ట్రాన్స్ఫర్లపై నిషేధం విధించడానికి ముందు కొంత సమయం ఇచ్చినప్పుడు వారికి అర్హతలు లేక కొందరికి బదిలీలు జరగలేదు. మరికొందరికి సిటీలో అవకాశం లేదు. దీంతో వారికి ట్రాన్స్ఫర్లు జరిగినా మళ్లీ వేర్వేరు చోట్లకే బదిలీలు జరిగాయి. దీంతో తమ భార్యలు ఉన్న ప్రాంతానికి తమను బదిలీ చేయాలంటూ కోరిన ఎస్ఐలను ఉన్నతాధికారి తీవ్రంగా మందలించారు.
అసలే ఎస్ఐల కొరత ఉండగా ఇప్పుడు బదిలీలంటూ ఎందుకు సతాయిస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు పెళ్లెందుకు చేసుకున్నారని, పిల్లలను కనడం ఎందుకంటూ అవమానకరంగా మాట్లాడి మళ్లీ ట్రాన్స్ఫర్ల ముచ్చటే ఎత్తొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఐలు మాత్రం తమ భార్యలు పనిచేసే చోటుకు తమను ట్రాన్స్ఫర్ చేయాలంటూ పదేపదే అడగడంతో పెద్దసారు మీరు ఇలాగే అడిగితే అసలు పోస్టింగులే ఇవ్వకుండా కార్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తానంటూ బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారంతా ప్రస్తుతం తీవ్ర మనోవేదనతో ఉన్నారు.
మనోవేదనతో ఎస్ఐకి గుండెపోటు!
దీంతో మహబూబ్నగర్ ప్రాంతానికి చెందిన ఒక ఎస్ఐ హైదరాబాద్లో పనిచేస్తున్న సమయంలో తీవ్రమైన గుండెనొప్పి రావడంతో ఆయనను సొంత ఊరికి తరలించారు. తన భార్య పనిచేస్తున్న దగ్గరకు తనను పంపించాలంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని, దీంతో ఆయన మనోవేదన చెంది గుండెపోటుకు గురయ్యారంటూ తోటి పోలీసు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నారని, ఆయన విషయంలో కూడా హైదరాబాద్ ఉన్నతాధికారులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
స్పౌజ్ బదిలీల విషయంలో కొంత పట్టువిడుపులు ఉంటాయని.. కానీ అలా చేయకుండా హైదరాబాద్లోనే ఉండాలని, ఇక్కడ సిబ్బంది లేని పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్లు కుదరవంటూ చెప్పడం చాలా అన్యాయమని ఆ ఎస్ఐలు చెప్పారు. పోలీసు శాఖలో ఎప్పుడైనా బదిలీలకు అవకాశం ఉంటుందని, కానీ తమ భార్యలు పనిచేస్తున్న శాఖల్లో ఏడాదికి ఒకసారి మాత్రమే అవకాశం ఇస్తారని, ఈ విషయం చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఐలు బాధపడుతున్నారు.
వారిపై అంత ప్రేమ ఎందుకు..!
ఒకవైపు స్పౌజ్ విషయంలో ఆ మాటే ఎత్తొద్దంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన ఆ అధికారులు తమకు దగ్గరగా ఉన్న ఎస్ఐలపై మాత్రం ప్రేమ చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారి పోస్టింగుల విషయంలో చాలా జాగ్రత్తగా వారికి, తమకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేశారంటూ విమర్శలు ఉన్నాయి. ఇటీవల నగరంలో జరిగిన ఎస్ఐల బదిలీలలో చాలా వరకు ఆయా జోన్ల అధికారులు, కొందరు ఏసీపీలకు నచ్చినవారిని తమకు అనుకూలమైన చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యేలా పావులు కదిపారంటూ చర్చ జరుగుతున్నది.
అప్పట్లో ఈ పోస్టింగుల వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయంటూ నమస్తే తెలంగాణలో కథనం వచ్చిన తర్వాత కొంత మేరకు వెనక్కు తగ్గినా తిరిగి ఆ ఎస్సైలపై ప్రేమ కురిపిస్తూ ఫోకల్ పోస్టులలో వారికి అవకాశం కల్పించినట్లు కమిషనరేట్లో మాట్లాడుకుంటున్నారు. తమకు అవకాశం ఇవ్వడానికే ముందుకు రాని అధికారులు వీరి విషయంలో మాత్రం అంతగా ప్రేమ ఎందుకు చూపించాలంటూ కొందరు ఎస్ఐలు తమ సీనియర్లతో చర్చిస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

