ఇప్పటివరకు హాస్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు తొలిసారి మాస్ అండ్ రగ్గ్డ్ పాత్రలో కనిపించబోతున్నారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఆయన ‘బిర్యాని’ అనే విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాది మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. శుక్రవారం బిర్యాని పాత్రలో సంపూర్ణేష్ బాబు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన రక్తంతో తడిచిన చేతులతో గొడ్డలి పట్టుకొని..బీడీ తాగుతూ కనిపిస్తున్నారు. ఆయన పాత్ర కథలో కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.