గెజిటెడ్ హెచ్ఎంల నూతన కార్యవర్గం ఏకగ్రీవం

హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం హైదరాబాద్లో కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా రాజ భాను చంద్ర ప్రకాశ్ (కరీంనగర్), ఉపాధ్యక్షులుగా రాజ్ గంగారెడ్డి (నిజామాబాద్), తుకారాం (మెదక్) ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కరోనాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రద్ధతో పనిచేశారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి విద్యాప్రమాణాలు పెంచడానికి కృషిచేస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల రాష్ట్ర కౌన్సిలర్లు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారులుగా సర్దార్నాయక్, రాధాకృష్ణ వ్యవహరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

