నార్నూర్ : ఉమ్మడి నార్నూర్, గాదిగూడ మండలంలోని 48 గ్రామపంచాయతీలలో పంచాయతీ ప్రత్యేక అధికారుల అధ్యక్షతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం (Sarpaches Oath ) సోమవారం ఘనంగా నిర్వహించారు. నార్నూర్ మండలంలో గెలుపొందిన సర్పంచులు పేందోర్ లక్ష్మణ్, మడవి లలిత, రాథోడ్ సురేష్, ఆత్రం సంగీత, జాదవ్ పరమేశ్వర్, కుమ్ర జన్నాబాయి, కుమ్ర ధర్ము, కుమ్ర జ్ఞానేశ్వర్, కనక సత్యనారాయణ, కుమ్ర మహదు, రాథోడ్ దిలీప్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.
గాదిగూడ మండలంలో కుమ్ర కమల, పరచకి రేణుక,కోడప కాను, సోయం అనూష బాయి, రాథోడ్ ఇందు బాయి, ఆడ చంద్రకళ, సీడం రాజేశ్వర్, గోడం అమృత్, రాథోడ్ స్వాతి, కోట్నాక్ బారిక్ రావ్, పూసం బాదిరావు సర్పంచులతో పాటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని నూతన సర్పంచులను శాలువా, పూలమాలలతో సన్మానించారు.