OTT Movies | ఈ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు థియేటర్లలో పలు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘ఛాంపియన్’, ‘శంబాల’, ‘ఈషా’, ‘దండోరా’, ‘పతంగ్’ వంటి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనుండగా, మరోవైపు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. థియేటర్స్‌లో విడుదల కానున్న చిత్రాలలో అన్ని చిత్రాలు కూడా ట్రైలర్స్, టీజర్స్‌తో మూవీలపై అంచనాలు పెంచాయి. ఛాంపియన్ చిత్రంపై అందరి ఫోకస్ చాలా ఎక్కువగా ఉంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించగా, ఇందులోని గిర గిర అనే పాట ఫుల్ ఫేమస్ కావడంతో మూవీపై కూడా అంచనాలు బాగా ఉన్నాయి. ఇక ఓటీటీ చిత్రాల కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి, ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే కంటెంట్ ఏంటో చూస్తే..
నెట్‌ఫ్లిక్స్‌లో
పోస్ట్ హౌస్ – డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్
గుడ్‌బై జాన్ – డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
ప్యారడైజ్ – డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
ఆంధ్రాకింగ్ తాలూకా – డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్
రివాల్వర్ రీటా – డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్ వీడియో
సూపర్ నేచురల్ (Web Series) – డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్
జీ5
మిడిల్ క్లాస్ – డిసెంబర్ 24 నుండి స్ట్రీమింగ్
రాంకిని భవన్ – డిసెంబర్ 25 నుండి స్ట్రీమింగ్
ఏక్ దివానే కీ దివానియత్ – డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్
జియో హాట్ స్టార్
అమాడ్యూస్- డిసెంబర్ 22
నోబడి 2- డిసెంబర్ 22
హ్యాపీ అండ్ యు నో ఇట్ – డిసెంబర్ 26
నాగిని – డిసెంబర్ 27
కాపీ హెన్హాజన్ టెస్ట్ – డిసెంబర్ 28
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఇతిరి నేరం – డిసెంబర్ 25
నిధియం భూతవం – డిసెంబర్ 26
లయన్స్ గేట్ ప్లే
పవర్స్ బుక్ ఐవీ సీజన్ 3 – డిసెంబర్ 26
రెడ్ సొంజా – డిసెంబర్ 26
మొత్తంగా చూస్తే, ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడితో ప్రేక్షకులకు పండగ వాతావరణం కనిపిస్తోంది.