ఫ్యాషన్ ట్రెండ్స్‌కు నవతరం సరికొత్త నిర్వచనం చెబుతున్నది. ఓవైపు నయామాల్ను ఆదరిస్తూనే.. ఇటు సౌందర్యంతోపాటు సౌకర్యానికీ పెద్దపీట వేస్తున్నది. ప్రీమియం, లగ్జరీతోపాటు తాము విశ్వసించే బ్రాండ్లపైనా నమ్మకం ఉంచుతున్నది. ఫ్యాషన్ ట్రెండింగ్స్పై ఇటీవల నిర్వహించిన ‘డెలాయిట్ ఫ్యాషన్ సర్వే’.. ఈ విషయాలను వెల్లడించింది. షాపింగ్‌లో ఎప్పట్లాగే మిలీనియల్స్, జెన్-జెడ్ తరమే ఆధిపత్యం చూపించినట్లు చెప్పుకొచ్చింది. ఫ్యాషన్ కొనుగోళ్లలో ఇతర యాక్ససరీస్‌తో పోలిస్తే.. దుస్తుల మార్కెట్ 20శాతం పెరిగినట్లు తేల్చింది.
ఇక నవతరం ఎక్కువగా ఇ-షాపింగ్‌పై ఆసక్తిచూపడంతోపాటు సోషల్ మీడియా వేదికగానూ షాపింగ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఏం కొనాలి? ఎక్కడ కొనాలి? అనే విషయాలతోపాటు బ్రాండ్ విలువలను కూడా యువ కొనుగోలుదారులు పరిగణనలోకి తీసుకుంటున్నారట. అదే సమయంలో లగ్జరీ రీసేల్పైనా జెన్ జీ ఆసక్తి చూపిస్తున్నది. ఫస్ట్‌హ్యాండ్ దుస్తుల మార్కెట్ కంటే రీసేల్ ఉత్పత్తులకే 3 నుంచి 4 రెట్లు అధికంగా ఓటేశారు. ముఖ్యంగా టైర్ 1, టైర్ 2 నగరాలు, వివాహ-ఆధారిత మార్కెట్లలో ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నట్లు సర్వే ప్రతినిధులు వెల్లడించారు.
ఇటు ఆన్లైన్ షాపింగ్ కూడా భారీగానే మార్కెట్ చేసుకుంటున్నది. ముఖ్యంగా, పలు ప్రత్యేక డిస్కౌంట్ సేల్స్‌లో నచ్చిన ఉత్పత్తులను తక్కువ ధరకు సొంతం చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అదే సమయంలో ఆన్లైన్ రెంటల్ ఫ్యాషన్ మార్కెట్ కూడా ఊపందుకుంటున్నది. పెళ్లిళ్లు, పార్టీల కోసం లగ్జరీ దుస్తులను అద్దె లెక్కన తీసుకోవడానికే ఈతరం ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నది. మొత్తానికి.. భారతీయ ఫ్యాషన్ వినియోగదారులు తెలివిగా, సందర్భోచితంగా ఫ్యాషన్ ట్రెండ్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు ‘డెలాయిట్ ఫ్యాషన్ సర్వే’ వెల్లడించింది.