పటాన్చెరు, డిసెంబర్ 31: ఈ నెల 26న అర్ధరాత్రి రుద్రారంలో గొర్రెలు, మేకలతో వస్తున్న లారీని అడ్డుకుని వాటిని లూటీ చేసిన దొంగలను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు పంపారు. పటాన్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి సమాక్షంలో సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివ రాల ప్రకారం.. పటాన్చెరు మండలం రుద్రారంలో ఈ నెల 26న అర్ధరాత్రి పరివార్ దాబా వద్ద రాజస్థాన్‌కు చెందిన లారీని గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి దాని లో ఉన్న 246 మేకలు, గొర్రెలను దోపిడి చేశారు. ఈ కేసులో దొంగతనానికి పాల్పడిన ఏడుగురిని పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద ఒక ఎర్టి గా కారు, రూ. 5లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నా రు. రెండు స్కూటీలు, రెండు సెల్ఫోన్లను సీజ్ చేశా రు. 82మేకలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర రాష్ర్టానికి చెందిన అమన్ ఫాజిల్ షేక్, సయ్య ద్ నదీమ్, జునైద్ ఫాజిల్ షేక్ అలియాస్ సల్మాన్ అనే ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ నగరానికి చెందిన మ ధుసూదన్ అనే వ్యక్తితో వ్యాపార లావాదేవీలు జరుపుతుంటారు. ఈ క్రమంలో నవాబ్ హసన్ రాజస్థాన్ అజ్మీర్‌కు చెందిన వ్యక్తికి రూ. 13లక్షలను అమన్, నదీ మ్, సల్మాన్‌లు మధుసూదన్ వద్ద తీసుకుని ఇచ్చారు.
అయితే డబ్బులు తీసుకున్న వ్యక్తి వారికి మేకలను, గొర్రెలను అందజేయలేదు. పైగా డబ్బులు కూడా ఇవ్వడం లేదు. నవాబ్ హసన్‌తో నష్టపోయిన బాధితులుగా అతడి మేకల లారీలోడ్ వచ్చినప్పుడు మేకలను, గొర్రెలను గుంజుకొని దాని ద్వారా డబ్బులు రాబట్టుకోవాలని మధుసూదన్, అమన్, సల్మాన్, నదీమ్‌లు పథ కం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 26న పరివార్ దాబా వద్ద మేకల లోడ్‌తో వస్తున్న లారీని పోలీసులమ ని ఆపి మేకలను, గొర్రెలను సచిన్, అశోక్, సురేశ్, జంగయ్యల సహాయంతో రెండు డీసీఎంలో, ఒక టాటా ఏస్ ఆటోలో వాటిని ఎక్కించి బలవంతంగా తరలించారు.
విచారణలో భాగంగా పోలీసులు రుద్రారం గ్రామానికి చెందిన సచిన్, అశోక్, సురేశ్‌లను ప్రశ్నించడంతో వారు సంఘటన వివరాలు వెళ్లడించారు. అయితే ఇక్కడ వారు దొంగలించిన మేకలు వారికి బాకీ ఉన్న నవాబ్ హసన్‌కు చెందినవి కావు. లారీ అస్లాంఖాన్ అనే వ్యక్తి వి. గొర్రెలు, మేకలు కమ్రుద్దీన్ అనే వ్యక్తివి కావడంతో వారిపై దొంగతనం కేసును నమోదు చేశామని వివరించారు. పోలీసులు షేఖ్ ఫాజిల్ (31), సయ్యద్ నదీమ్ రహ్మన్(25), తంగరికర్ మధుసూదన్ (42) గౌలిగర్ సచిన్ (30), బుయంకర్ అశోక్ (36), బుయంకర్ సురేశ్(49), ఉప్పల జంగయ్య (52)లను అరెస్టు చేశా రు. వీరిలో షేక్ అమన్ ఫాజిల్ (29) పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పటాన్చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి, క్రైమ్ సీఐ కే బీసన్న, క్రైమ్ ఎస్ఐ పవన్‌కుమార్, హెచ్‌సీలు అశోక్, రాజుగౌడ్, నరేశ్, షాకీర్‌ను డీఎస్పీ భీమ్‌రెడ్డి అభినందించారు.