Work from Home | న్యూఢిల్లీ, నవంబర్ 3: భారత్‌లో ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల కన్నా ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులు మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. యూఎస్‌కు చెందిన సపియన్స్ ల్యాబ్స్ 65 దేశాల్లో 54 వేల మంది ఉద్యోగులను సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. పని ప్రదేశంలో బలమైన సంబంధాలు, అవసరాలు మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని నివేదిక తెలిపింది.
బలహీనమైన పని ప్రదేశ బంధాలు, అవసర లేమి దుఃఖానికి, నిరాశకు కారణమై ప్రేరణను తగ్గిస్తాయని పేర్కొంది. ఏ ఉద్యోగంలోనైనా సహోద్యోగులతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం, సొంత పని పట్ల గర్వ పడటం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని వెల్లడించింది. బలహీనమైన పని ప్రదేశ సంబంధాలు, మానసిక ఒత్తిడికి మధ్య ఉన్న సహ సంబంధం భారత్‌లో తక్కువగా ఉంది. ప్రపంచ సగటు(16 శాతం), అమెరికాతో(18 శాతం) పోలిస్తే భారత్‌లో 13 శాతం ఉద్యోగులు పని ఒత్తిడిని భరించ లేకుండా ఉన్నామని అభిప్రాయపడ్డారు.