హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్కో)లో పనిచేస్తున్న 64 మంది ఇంజినీర్లకు పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఎలక్ట్రికల్ విభాగంలో 24, మెకానికల్‌లో 17, సివిల్‌లో 23 మంది ఇంజినీర్లకు పదోన్నతులు లభించాయి.
ఇవన్నీ అడ్‌హక్ పదోన్నతులే. ఎస్ఈ నుంచి సీఈగా నలుగురు, డీఈ/ఈఈ నుంచి ఎస్ఈగా 11, ఏడీఈ/ ఏఈఈ నుంచి డీఈ/ఈఈగా 37, ఏఈ/ఏఈఈ నుంచి ఏఈఈగా 12 మందికి పదోన్నతులు లభించాయి. ఈ పదోన్నతులు కల్పించిన ప్రభుత్వానికి తెలంగాణ పవర్ ఇంజినీర్స్ అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం (టీవీఈఏ) నేతలు నెహ్రునాయక్, భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.