Hathras Stampede | నోయిడా, జూలై 6: హాథ్రస్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు దేవ్‌ప్రకాశ్ మధుకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి మధుకర్‌ను అరెస్టు చేసినట్టు హథ్రస్ ఎస్పీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు.
ఘటన జరిగిన సత్సంగ్‌కు ప్రధాన నిర్వాహకుడు దేవ్‌ప్రకాశ్ అని ఎస్పీ చెప్పారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అతడి ఆర్థిక లావాదేవీలు, కాల్ రికార్డులు కూడా పరిశీలిస్తామని తెలిపారు. కాగా పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో భోలే బాబాపై తొలి కేసు దాఖలైంది.
తొక్కిసలాట ఘటనపై భోలే బాబా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి జీవితాంతం సాయం అందించాలని తన ట్రస్ట్ కమిటీ సభ్యులను కోరినట్టు తెలిపారు.