‘వెన్నెల కాంతులకు, సూర్యుడి ప్రభలకు తళుక్కున మెరిసే సముద్ర జలాలే మనకు తెలుసు. కానీ వెలుగు పడగానే జిలుగులీనే సాగరకన్య గురించి విన్నారా? ఆ అందాల మత్స్యకన్యను చూడాలంటే కడలి లోతుల్లోకి వెళ్లక్కర్లేదు. సాగర మథనమూ చేయక్కర్లేదు. ఇదిగో ఇక్కడే ఉంది చూడండి..’ అంటున్నది స్వరోవ్స్కీ. ఈ సంస్థ మార్కెట్లో విడుదల చేసిన కొత్త కళాకృతి పేరు ‘ద లిటిల్ మెర్మెయిడ్’.
అదే పేరుతో వచ్చిన డిస్నీ సినిమాలోని ప్రిన్సెస్ ఏరియల్, ఆమె మిత్ర బృందం పాత్రలకు బొమ్మల రూపం ఇచ్చింది స్వరోవ్స్కీ. ఇందులో 25,300 విభిన్నమైన రంగు రాళ్లను పొదిగారు. తయారీకి 220 గంటల సమయం పట్టిందట. ధర విషయానికి వస్తే.. ఎనిమిదిన్నర లక్షల రూపాయల పైమాటే.