ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని బీసీ స్టడీ సర్కిల్ ప్రాంగణాన్ని ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీసీ స్టడీ సర్కిల్లో చదివి ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించేందుకు తిరిగి వస్తానని చెప్పారు. బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్ర డైరెక్టర్ బాలాచారి మాట్లాడుతూ.. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను అందిస్తున్నామన్నారు. అనంతరం ఉపేంద్రను ఘనంగా సన్మానించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో ఉపేంద్ర మొక్కను నాటారు.