హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్‌బోర్డు మరో అవకాశమిచ్చింది. రూ.7వేల ఆలస్య రుసుముతో సోమవారం వరకు ఫీజు చెల్లించే చాన్స్ ఇచ్చింది.
ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.