తిరుపతి,జున్ 30: జూలైలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ)ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
– జూలై 5న సర్వఏకాదశి.
– జూలై 6న వసంతమండపంలో రావణవధ ఘట్ట పారాయణం.
– జూలై 14న శ్రీ మరీచి మహర్షి వర్షతిరునక్షత్రం.
– జూలై 16న శ్రీవారి ఆణివర ఆస్థానం.
– జూలై 20న శయన ఏకాదశి,చాతుర్మాస్య వ్రతారంభం.
– జూలై 21న నారాయణగిరిలో ఛత్రస్థాపనం.
– జూలై 24న వ్యాసజయంతి,గురుపూర్ణిమ,శ్రీ ఆళ్వందార్ల వర్ష తిరునక్షత్రం.