హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): శాసనసభ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం మహాభారతంలో ద్రౌపదికి జరిగిన పరాభవంతో సమానమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాసమస్యలపై నిరసనగా నల్ల టీ-షర్టులు ధరించి వచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యేలను కావాలనే మహిళా కానిస్టేబుళ్లతో అడ్డుకున్నారని, అదే సమయంలో మహిళా ఎమ్మెల్యేల వద్ద మగ పోలీసులను మోహరించి వారిని తీవ్రంగా వేధించారని ఆరోపించారు. ఈ అకృత్యా లు స్పీకర్ ఆదేశాలతో జరిగాయా? లేక సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతో జరిగా యా? అని నిలదీశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆమె మీ డియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కావాలనే దళిత కార్డును రాజకీయ లబ్ధి కో సం వాడుకుంటున్నారని విమర్శించారు.
తోపులాటను లైంగిక వేధింపులుగా చిత్రీకరించి మహిళా కానిస్టేబుల్‌తో ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెట్టించడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనమని దుయ్యబట్టారు. మహిళా కానిస్టేబుళ్లు దారికి అడ్డంగా ఉం డొద్దని తమ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదని, కేసు పెట్టిన కానిస్టేబుల్‌ను స్పీకర్ సన్మానించడం వెనుక ఉన్న దురుద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి పోక్సో కేసు నిం దితులకు రక్షణ కల్పిస్తూ, ప్రజల తరఫున పోరాడే ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు బనాయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో ఎంపీ గా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి నల్లచొకా ధరించి పార్లమెంటుకు వెళ్లలేదా? అని తుల ఉమ ప్రశ్నించారు. నిరసనలు తెలిపితే లైంగిక వేధింపుల కేసులు పెట్టే నీచ రాజకీయాలకు రేవంత్‌రెడ్డి దిగజారడం అత్యంత హేయమని సుమిత్రానంద్ మండిపడ్డారు.