గాయం కారణంగా కొన్నిరోజులుగా రెస్ట్ మోడ్‌లో ఉన్న అగ్ర కథానాయకుడు బాలకృష్ణ.. మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘దాదా’ చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపుగా ఫస్టాఫ్‌ని పూర్తి చేసుకున్నది. త్వరలోనే బాలయ్య ఈ సినిమా లొకేషన్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు వృద్ధి సినిమాస్ సంస్థ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ ‘NBK 112’ చిత్రాన్ని చేయనున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ తొలివారం నుంచే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నది. ఈ సినిమాలో బాలకృష్ణ స్క్రీన్టైమ్ ఎక్కువగా ఉంటుందని వినికిడి. అందుకే మూడున్నర నెలలపాటు కాల్షీట్స్ని బాలకృష్ణ నుంచి తీసుకున్నారట. స్క్రిప్ట్ విషయంలో కొరటాల సంతృప్తిగా ఉన్నారట. బాలకృష్ణ కూడా ఈ సినిమా షూటింగ్‌ని త్వరగా మొదలుపెట్టాలనే ఆతృతతో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. యువసుధ ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్న విషయం విదితమే.