టెక్సాస్ : ఎక్కువ రోజులపాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాముల గుండె కుచించుకుపోతుందంట. అంతరిక్షంలో వ్యాయామం చేసినప్పటికీ గుండె పరిణామంలో మార్పు కనిపిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అంతరిక్షంలో ఉన్నప్పుడు గుండెపై ప్రభావాన్ని నిలువరించేందుకు తక్కువ తీవ్రత ఉన్న వ్యాయామాలు కూడా సరిపోవని వారు సెలవిస్తున్నారు.
టెక్సాస్లోని సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు 340 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన ఒక వ్యోమగామిపై పరిశోధనలు చేసిన అనంతరం ఈ విషయాలను వెల్లడించారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. అంతరిక్షంలో ఉన్నప్పుడు శరీరం బరువును అనుభవించదు. దీన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధకులు 2015 నుంచి ఏడాదిపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగామి స్కాట్ కెల్లీపై అధ్యయనం జరిపారు.
ఈయనపై వచ్చిన ఫలితాలను 2018 లో పసిఫిక్ మహాసముద్రంలో గజ ఈతగాడు బినాయిడ్ లెకామ్టే నివేదికలతో పోల్చారు. గజ ఈతగాడు బినాయిడ్ 159 రోజులు రోజులో సుమారు 6 గంటలు ఈత కొడుతూ.. పసిఫిక్ మహాసముద్రం మీదుగా 2,821 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఈ రెండూ డాటాలను తమ పరిశోధనకు ఉపయోగించారు.
రెండింటిలో, గుండె దిగువ భాగంలో ఉండే జఠరిక పరిమాణంలో తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మనం కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు.. గురుత్వాకర్షణ
కారణంగా శరీరంలోని రక్తం పాదాల వైపు ఎక్కువగా ప్రవహిస్తుంది. గుండె కూడా అలాంటి విధులు నిర్వహించవలసి ఉంటుంది. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా గుండె దాని ఆకారాన్ని నిలుపుకుంటూ
శరీరమంతా రక్తాన్ని పంపింగ్ చేయాలి. అయితే, అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేనప్పుడు ఎక్కువ రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫలితంగా కణాలు, కణజాలం వీటిలో తగ్గిపోతాయి. శాస్త్రీయ పరిభాషలో ఈ సమస్యను అట్రోఫీ అంటారు. వ్యోమగాములలో ఈ క్షీణత వల్ల ఎముకలు బలహీనపడి, పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
వ్యోమగామి, గజ ఈతగాడు.. ఈ ఇద్దరు గుండెపై ఎలా ప్రభావం చూపిందనే దానిపై వైద్యుల అవగాహన వేర్వేరు పరిశోధనల ద్వారా అర్థమైంది. గుండె రెండు ఎడమ జఠరికల కణాలు, కణజాలాల్లో తగ్గుదల ఉన్నదని పరిశోధనలో వెల్లడైంది. జఠరికల వెడల్పు తగ్గింది.
వ్యోమగామి స్కాట్ కెల్లీ జఠరిక పరిమాణం 2 అంగుళాల నుంచి 1.8 అంగుళాలకు తగ్గింది. అదే సమయంలో ఈతగాడు బినాయిడ్లోని 1.9 నుంచి 1.8 అంగుళాలకు పరిణామం పడిపోయినట్లు పరిశోధకులు తెలిపారు.
చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం.. వ్యాక్సిన్ ఇప్పించడం తప్పనిసరి
భారతదేశానికి వచ్చిన దలైలామా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..