న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగబోయే 57వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో రేట్ల మార్పునకు సంబంధించి ఎలాంటి అంశాలు చర్చకు రావని వారు పేర్కొంటున్నారు. పరిమితమైన అంశాలపైనే చర్చ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్లో జీఎస్టీ రేట్లు, స్లాబులను హేతుబద్ధం చేసిన సంగతి విదితమే. 5, 12, 18, 28 శాతం స్లాబులను 5, 18 శాతం స్లాబుల్లోకి మార్చిన విషయం తెలిసిందే.
భారీ పన్ను ఎగవేతదారులను జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేస్తున్నది తెలిసిందే. అయితే ఈ అధికారాన్ని తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అరెస్టులు ట్యాక్స్ అఫీషియల్స్ పరిధిని మించి ఉంటున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాబోయే కౌన్సిల్ మీటింగ్లో ఈ అంశంపై చర్చించే వీలున్నట్టు తెలుస్తున్నది. అరెస్టుల స్థానంలో జరిమానాలను విధించవచ్చని చెప్తున్నారు.