ఏడాదికి ఒక్కసారే.. ఏప్రిల్ 1 నుంచే అమలు
ట్యాక్స్ రేటు మార్పులకు సంబంధించిన ఏ ప్రతిపాదననైనా ఇకపై ఏడాదికి ఒక్కసారే పరిశీలనకు తీసుకోనున్నది వస్తు, సేవల పన్ను మండలి (జీఎస్టీ కౌన్సిల్). అలాగే రేట్ల మార్పు నిర్ణయాలు ఏప్రిల్ 1 నుంచే (కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు) అమల్లోకి రానున్నాయి.
- ఇక పన్ను రేట్ల మార్పులపై జీఎస్టీ కౌన్సిల్ విధానం
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగబోయే 57వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో రేట్ల మార్పునకు సంబంధించి ఎలాంటి అంశాలు చర్చకు రావని వారు పేర్కొంటున్నారు. పరిమితమైన అంశాలపైనే చర్చ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ రేట్లు, స్లాబులను హేతుబద్ధం చేసిన సంగతి విదితమే. 5, 12, 18, 28 శాతం స్లాబులను 5, 18 శాతం స్లాబుల్లోకి మార్చిన విషయం తెలిసిందే.
అరెస్టుల స్థానంలో జరిమానాలు?
భారీ పన్ను ఎగవేతదారులను జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేస్తున్నది తెలిసిందే. అయితే ఈ అధికారాన్ని తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అరెస్టులు ట్యాక్స్ అఫీషియల్స్ పరిధిని మించి ఉంటున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాబోయే కౌన్సిల్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించే వీలున్నట్టు తెలుస్తున్నది. అరెస్టుల స్థానంలో జరిమానాలను విధించవచ్చని చెప్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Land Encroachment | కుర్మల్‌గూడలో కబ్జా పర్వం.. రూ.200 కోట్ల భూమి హాంఫట్
Hyderabad Ganja Case | గంజాయి బామ్మ నెట్వర్క్ పెద్దదే.. ఫోన్ కాల్ లిస్ట్‌తో బయటపడ్డ అసలు వ్యవహారం!
Platelet Count | పిల్లల్లో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Farmers Self Declaration | ఎండితే మా ఖర్మే.. పంటల సాగుపై రైతుల నుంచి సర్కార్ సెల్ఫ్ డిక్లరేషన్
Gen Z Protest | జెన్ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్.. సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిచ్ ఓటమిపాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

