నాలుగో రోజూ హోరాహోరీ
- యుద్ధ ట్యాంకులను అడ్డుకొంటున్న ఉక్రెయిన్ పౌరులు
- ఆదివారం మధ్యాహ్నం రష్యా చేతికి ఖార్కీవ్
- గంటల్లోనే మళ్లీ నియంత్రణలోకి తెచ్చుకొన్న ఉక్రెయిన్
- రాజధాని కీవ్‌లో కొనసాగుతున్న రష్యా దాడులు
- అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఉక్రెయిన్
- బెలారస్లో రష్యాతో చర్చలకు సిద్ధమే: అధ్యక్షుడు జెలెన్స్కీ
- రష్యా దాడులపై యూఎన్ జనరల్ అసెంబ్లీ అత్యవసర భేటీ
- రష్యాను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్
కీవ్, ఫిబ్రవరి 27: రష్యా బలగాలతో ఉక్రెయిన్ సైన్యం హోరాహోరిగా తలపడుతున్నది. సామాన్య పౌరులు సైతం వీధుల్లోకి వచ్చి పోరాటాన్ని సాగిస్తున్నారు. రష్యా యుద్ధ ట్యాంకులను అడ్డుకొంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్‌లోకి ప్రవేశించాయి. నగరాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఒక సమయంలో నగరాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు ప్రకటించాయి. అయితే, ఉక్రెయిన్ సైన్యం వీరోచిత పోరాటంతో వారి ప్రయత్నం విఫలమైంది. ఉక్రెయిన్ సేనలదాటికి ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు తోకముడిచాయి. దీంతో ఖార్కీవ్ పూర్తిగా ఉక్రెయిన్ సైన్యం నియంత్రణలోనే ఉన్నట్టు ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. ఇక్కడి పోరాట దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలతో పాటు పోర్టులపై కూడా రష్యా దృష్టి పెట్టింది. ఆదివారం దక్షిణ ఉక్రెయిన్‌లోని రెండు కీలక పోర్టులను స్వాధీనం చేసుకొన్నది. కీవ్ సమీపంలోని వాసిల్కోవ్ వద్ద ఒక చమురు డిపోను రష్యా సేనలు పేల్చేశాయి. మరోచోట గ్యాస్ పైప్‌లైన్‌ను పేల్చాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దక్షిణ ప్రాంతంలోని మరో నగరం నోవా కఖోవ్‌కాను స్వాధీనం చేసుకొన్నట్టు రష్యా సేనలు ప్రకటించుకున్నాయి.
సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్
యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 3.68 లక్ష మంది వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఉక్రెయిన్ శరణార్థులను వీసా లేకుండానే పోలాండ్ అనుమతిస్తున్నది. విదేశాలకు వలస వెళ్తున్నవారితో ఉక్రెయిన్ సరిహద్దులకు జనం పోటెత్తుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించించింది. మైళ్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.
4,300 మంది రష్యా సైనికులు మృతి
రష్యా దాడుల్లో 210 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ బలగాల చేతిలో 4,300 మంది రష్యా సైనికులు హతమయ్యారు. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపింది. కాగా, ఉక్రెయిన్‌లో శాంతి భద్రతలు క్షీణిస్తుండటంతో ఐరాస, భాగస్వామి సంస్థలు అక్కడ తమ కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేసుకొన్నాయి.
ఐసీజేకు ఉక్రెయిన్
రష్యా దాడులను ఆపేలా ఆదేశించాలని కోరుతూ నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఉక్రెయిన్ ఆశ్రయించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం నుంచి రష్యాను తొలగించాలని కోరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశం నిర్వహించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

