అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ సుమారు లక్ష ఉద్యోగాలు ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన సంబురాలు మూడ్రోజులుగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
గరిడేపల్లి, మార్చి 11 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి
క్షీరాభిషేకం చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణానాయక్, ఎంపీపీ పెండెం సుజాతా శ్రీనివాస్‌గౌడ్, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, పార్టీ మండల పరిశీలకుడు పిడమర్తి రాజు, మండల ప్రధాన కార్యదర్శి వి.పార్ధసారథి, మహిళాధ్యక్షురాలు గందె వినోద, సర్వారం పీఏసీఎస్ చైర్మన్ వీరంరెడ్డి శంభిరెడ్డి పాల్గొన్నారు.
అర్వపల్లి, మార్చి 11 : జాజిరెడ్డిగూడెంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంభం ఉషారాణి, ఉప సర్పంచ్ వల్లాల రమేశ్, టీఆర్ఎస్ నాయకులు మొరిశెట్టి ఉపేందర్, కుంభం నాగరాజు, పెద్ది శ్రీనివాస్, కొప్పుల సోమిరెడ్డి, పున్న హరిప్రసాద్, మామిడి సత్యనారాయణ, మల్లయ్య, రామ్మూర్తి, వెంకన్న పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్, మార్చి 11 : జిల్లా కేంద్రంలోని సాగర్‌రోడ్డులో టీఆర్ఎస్ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో యూత్ విభాగం మండలాధ్యక్షుడు ఐతగోని విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గాదె రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పోలె శివాజీ, నాయకులు బడుపుల శంకర్, బుచ్చాల నాగరాజు గౌడ్, నాగరాజు, నవీన్, జగన్, నగేశ్ పాల్గొన్నారు.
శాలిగౌరారం, మార్చి 11 : మండలంలోని తిర్మలరాయినిగూడెంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పడాల సత్తయ్య ముదిరాజ్ అధ్వర్యంలో సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌర వీరయ్య, పడాల రమేశ్, పడాల రాజు, పడాల వెంకన్న, ఐతగోని సైదులు, వాడపల్లి సైదులు, బొల్లెపెల్లి హుస్సేన్, సైదులు, వడ్లకొండ పాపయ్య, వెంకన్న, బండ సతీశ్, చింతకాయల సోములు, బోళ్ల నాగరాజు, పడాల లింగయ్య పాల్గొన్నారు.