అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టారు. కాషాయ వస్ర్తాలు ధరించి మాలధారణలో ఉన్న ఆయన ఫొటోలు సోషల్మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నాయి. అభిమానులతో కలిసి తీయించుకున్న ఈ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఎన్టీఆర్ తొలిసారి హనుమాన్ దీక్ష తీసుకున్నారని చెబుతున్నారు. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్..త్వరలో కొరటాల శివ దర్శకత్వం వహించే చిత్రంలో నటించబోతున్నారు.