– సినీనటి రితికా నాయక్ సందడి
కోదాడ, అక్టోబర్ 03 : కోదాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నై షాపింగ్ మాల్ ను సినీనటి రితక నాయక్, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శనివారం ప్రారంభించారు. మాల్లోని పలు విభాగాలను సందర్శించి నూతన వస్త్ర శ్రేణిని, డిజైన్లను ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం వేదికపై నటి రితిక నాయక్ పలు పాటలకు సరదాగా స్టెప్పులు వేసి వీక్షకుల్లో హుషారు నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కోదాడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజలకు అత్యాధునిక మోడల్స్, నాణ్యమైన వస్త్రాలు ఒకేచోట లభించేలా ది చెన్నై షాపింగ్ మాల్ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నెని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, కమిషనర్ రమాదేవి, స్థానిక కౌన్సిలర్ కోల్లా కోటిరెడ్డి, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, షాపింగ్ మాల్ నిర్వాహకులు మర్రి వెంకటరెడ్డి, పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు.

కోదాడలో ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం