బంజారాహిల్స్,ఆగస్టు 29: స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను డీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఫలక్‌నుమా సమీపంలోని జుబేల్ కాలనీలో నివాసం ఉంటున్న మహ్మద్ ముజ్తఫా ఫారూక్(21) ఆనే విద్యార్థి శనివారం రాత్రి 12.45 ప్రాంతంలో తన స్నేహితులను కలిసేందుకు బంజారాహిల్స్‌కు వచ్చాడు.
ఇంటికి వెళ్లేందుకు బయలుదేరి వెళ్తుండగా బంజారాహిల్స్ రోడ్ నెం 1లో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను డీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఫారూఖ్ అక్కడికక్కడే మృతి చెందగా అతడి స్నేహితుడు అనాస్ అలీకి తీవ్రగాయాలయ్యాయి. రాత్రి 12గంటల ప్రాంతంలో తండ్రి మహ్మద్ ఫారూక్‌కు ఫోన్ చేయగా అరగంటలో ఇంటికి వస్తున్నానని చెప్పాడు.
కాసేపట్లోనే తన కొడుకు దుర్మరణం పాలయినట్లు ఫోన్ రావడంతో ఫారూక్ కన్నీరు మున్నీరయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.