హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రానికి చెందిన ప్రముఖ పైపుల తయారీ సంస్థ హరిఓం పైప్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ రోజే అదరహో అనిపించింది. కంపెనీ ఇష్యూ ధర రూ.151 కంటే ఏకంగా 51 శాతం లాభపడింది. రూ.214 వద్ద ప్రారంభమైన షేరు ధర అమాంతం పెరిగింది. ఇష్యూ ధర కంటే 39.86 శాతం అధికంగా ప్రారంభమైంది. చివరకు 46.86 శాతం లాభపడి రూ.224.70 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలోనూ 50.98 శాతం లాభపడి రూ.231 వద్ద స్థిరపడింది. రూ.130 కోట్ల ఐపీవోకిగాను 8 రెట్ల అధిక బిడ్డింగ్ వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్ 5దాకా ఇష్యూ నడిచింది.