
తమిళనాడులో కుంభవృష్టి కురిసింది. రాజధాని చెన్నైతో పాటు పలు జిల్లాల్లోని పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. సీఎం స్టాలిన్ వానలోనే ముంపు ప్రాంతాలను సందర్శించి, సహాయ చర్యలను పర్యవేక్షించారు. వందలాది మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. చెన్నైలో ఒక్క నెలలో 100 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవడం గత 200 ఏండ్లలో ఇది నాలుగోసారి అని స్టాలిన్ ట్వీట్ చేశారు.