పటాకుల దుకాణాల ఏర్పాటుకు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

సోమవారానికి మొత్తం 4,753 దరఖాస్తులు
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దీపావళి పటాకుల దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనున్నది. పటాకుల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను రాష్ట్ర అగ్నిమాపకశాఖ ఆన్లైన్లో జారీచేస్తున్నది. దుకాణాల్లో విక్రయించే సరుకు బరువు ఆధారంగా మూడు (100 కిలోల లోపు, 100 నుంచి 300 కిలోలు, 300 కంటే ఎక్కువ కిలోల) క్యాటగిరీల్లో అనుమతులు జారీచేస్తున్నారు. సోమవారం వరకు ఆన్లైన్లో మొత్తం 4,753 దరఖాస్తులు అందాయని, వీటిలో నిబంధనల ప్రకారం వివరాలన్నీ సక్రమంగా ఉన్న 4,173 మంది దుకాణదారులకు అనుమతులు జారీ అయ్యాయని రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య వెల్లడించారు. పటాకుల దుకాణాల ఏర్పాటుకు సరిపడినంత స్థలం లేని కారణంగా 164 దరఖాస్తులను తిరస్కరించామని, మరో 416 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. గతేడాది 3,393 దుకాణాల ఏర్పాటుకు అనుమతులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

