కేటీఆర్‌కు అపురూప కానుక
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దివ్యాంగురాలైన చిత్రకారిణి స్వప్నిక ఆయనకు అపురూప కానుక అందించారు.
- నోటితో ఆయన చిత్రాన్ని గీసిన ఏపీ అమ్మాయి స్వప్నిక
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దివ్యాంగురాలైన చిత్రకారిణి స్వప్నిక ఆయనకు అపురూప కానుక అందించారు. చేతులు లేకపోయినా నోటితో కేటీఆర్ చిత్రపటాన్ని గీశారు. తనకు కేటీఆర్ అంటే ఎంతో అభిమానమని, ఆయన చేసే సేవా కార్యక్రమాలు తనకు స్ఫూర్తిగా నిలిచాయని ఆమె తెలిపారు. పంజాబ్‌కు చెందిన దివ్యాంగ చెస్ క్రీడాకారిణి మల్లికా హండాకు కేటీఆర్ రూ.15 లక్షల ఆర్థిక సాయం చేసి అండగా నిలిచిన తీరు తనలో ఎంతో స్ఫూర్తి నింపిందని చెప్పారు.
భవిష్యత్‌లో మంత్రి కేటీఆర్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించిన ఆమె.. మంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన స్వప్నిక తన చిన్నతనంలోనే విద్యుత్తు షాక్‌తో రెండు చేతులు కోల్పోయింది. అయినప్పటికీ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోకుండా నోటితోనే పెయింటింగ్ వేయడం నేర్చుకున్నారు. సామాజిక అంశాలపై, ఆడపిల్లల సమస్యలపై పెన్సిల్ స్కెచ్‌ల రూపంలో చిత్రాలు గీస్త్తూ అందరి ప్రశంసలను పొందుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

