Kotagiri | కోటగిరి : గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టాలని, గౌడ కులస్తులకు అవమానించిన గ్రామ అభివృద్ధి కమిటీ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గీత పని వారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై గ్రామ అభివృద్ధి కమిటీ దౌర్జన్యాలకు నిరసనగా బుధవారం కోటగిరి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గీత పని వాళ్ల సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తులు ధర్నా చేప్టారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి విట్టల్ గౌడ్ మాట్లాడుతూ తాళంపు గ్రామంలో కులవృత్తి ని నమ్ముకొని 15 కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నాయని రోజువారి గా చెట్లు గీసుకొని కల్లు అనుకుంటున్నారు. అలాంటి వారిపై విడిసికీ డబ్బులు ఇస్తే నే కల్లు అమ్మాలని హుకుం జారీ చేస్తూ తరచూ గౌడ కులస్తులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమానికి గౌడ ఆడబిడ్డలు మందిరానికి వెళ్తే మీరు లోపలికి రావద్దని, ఇది గ్రామ అభివృద్ధి కమిటీ ఆదేశాలని ఆడబిడ్డలను మందిరం నుండి పూజారి పంపించడం ఇది సమాజానికి సిగ్గుచేటు అన్ని మండిపడ్డారు.
విడిసి పై పీడీ యాక్ట్ చట్టం తీసుకురావాలని వీడిసీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందించి గీత కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని, వెంటనే వీడిసి కమిటీ వారిపై కేసులు నమోదు చేయాలని, కల్లుగీత కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు గీత కార్మికులు ప్రకాష్ గౌడ్, కృష్ణ గౌడ్, సాయి కృష్ణ గౌడ్ అరుణ్ కుమార్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజా గౌడ్, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.