అపజయంలో నుంచి విజయాన్ని వెతుక్కుంది పూజా హెగ్డే. కెరీర్ ప్రారంభంలోనే ఫ్లాపులు పలకరించినా పట్టుదలగా ప్రయత్నించింది. ఏదో చేసేద్దాం అని ఏరోజూ నటించలేదని చెప్పే పూజా…అలాంటి హిందీ అవకాశాలను వద్దనుకుని తెలుగులో కొత్త ప్రయాణం ప్రారంభించింది. ప్రాంతీయంగా గెలిచి జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా తారగా ఎదిగింది. ఈ క్రమంలో ప్రభాస్ సరసన ఆమె నటించిన ‘రాధేశ్యామ్’ ఈ నెల 11న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన తన అనుభవాలను పంచుకుంది పూజా హెగ్డే. ఆ విశేషాలు చూస్తే..
జీవితాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలనుకునే వ్యక్తిత్వం ప్రేరణది. నా కెరీర్లో ఇప్పటిదాకా ఇలాంటి పాత్రలో నటించలేదు. అనేక భావోద్వేగాలున్న ఈ పాత్ర నటిగా నాకొక సవాలు అనిపించింది. ఎన్నో ఛాయలతో, గాఢతతో సాగుతుంది. ఈ పాత్ర కోసం బుక్స్ చదివాను. రీసెర్చ్ చేశాను. ప్రేరణ పాత్రలో కొత్త పూజా హెగ్డేను చూస్తారు.
ఇది తరచూ వచ్చే సినిమా కాదు. ప్రేమకథే అయినా భిన్నంగా ఉంటుంది. వినోదంతో పాటు కదిలించే భావోద్వేగాలు ఉంటాయి. సాంకేతికంగా ఉన్నతమైన చిత్రమని చెప్పగలను. ఆ టీమ్‌ను చూసి నా క్యారెక్టర్ వరకు బాగా చేస్తే చాలు మిగతాది మర్చిపోవచ్చు అనేంత ధైర్యం కలిగింది. విజువల్స్, సంగీతం మిమ్మల్ని రాధే శ్యామ్ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.
ఈ చిత్రంతో నాది నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం. మొదటిసారి షూటింగ్ కోసం జార్జియా వెళ్లినప్పుడు ఫస్ట్ లాక్డౌన్ పెట్టారు.
అపజయంలో నుంచి విజయాన్ని వెతుక్కుంది పూజా హెగ్డే. కెరీర్ ప్రారంభంలోనే ఫ్లాపులు పలకరించినా పట్టుదలగా ప్రయత్నించింది. ఏదో చేసేద్దాం అని ఏరోజూ నటించలేదని చెప్పే పూజా…అలాంటి హిందీ అవకాశాలను వద్దనుకుని తెలుగులో కొత్త ప్రయాణం ప్రారంభించింది. ప్రాంతీయంగా గెలిచి జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా తారగా ఎదిగింది. ఈ క్రమంలో ప్రభాస్ సరసన ఆమె నటించిన ‘రాధేశ్యామ్’ ఈ నెల 11న విడుదలవుతున్నది. ఈ సందర్భంగాసినిమాలో నటించిన తన అనుభవాలను పంచుకుంది పూజా హెగ్డే. ఆ విశేషాలు చూస్తే.. చేసుకోవచ్చు అనే భయంకర పరిస్థితులు అవి. తిరిగి వచ్చేయమంటూ సన్నిహితుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చేవి. ఫ్లైట్స్ రద్దు చేసే సమయానికి తిరిగొచ్చాం. ఎమోషనల్ సీన్స్ చేసేప్పుడు నిజంగానే ఏడ్చేశాను. కట్ చెప్పాక మళ్లీ హిందీకి మరోసారి అనేవారు. దేవుడా..మళ్లీ ఏడవాలా అనిపించేది.
నేను నటించిన హీరోల్లో ఎన్టీఆర్‌కు భాషమీద పట్టు ఎక్కువ. సెట్లో చాలా సందడి చేస్తారు. అల్లు అర్జున్ కూడా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రభాస్ బయట ఎక్కువగా మాట్లాడరు గానీ షూటింగ్ టైమ్‌లో అందరితో కలిసిపోయి సరదాగా ఉంటారు. ఇటలీలో షూటింగ్ చేస్తున్నప్పుడు నా టీమ్ కొవిడ్ బారిన పడితే రోజూ తన దగ్గర నుంచి మంచి వంటకాలు పంపించేవారు. ప్రభాస్, నా హైట్ మ్యాచ్ అవడంతో మా జంట బాగుందని చెబుతున్నారు అనుకుంటా.
అందం, మంచితనం, పేరు ఉన్న ప్రభాస్ పెళ్లెందుకు చేసుకోలేదని మీరు అడుగుతుంటారు కదా. అందుకే సినిమాలో మీ అందరి తరపున నేను ప్రభాస్‌ను అడిగాను.
టైటానిక్ సినిమాతో మా చిత్రాన్ని పోల్చడం సంతోషంగా ఉంది. అయితే టైటానిక్ కథతో రాధే శ్యామ్ కథకు ఎక్కడా ఎలాంటి పోలికలు ఉండవు.
నమ్ముతాను. చాలాసార్లు జోతిష్యం చెప్పించుకున్నా. మన సంస్కృతి చాలా గొప్పది, పూర్వీకులు ఏ సాధనాలు లేకున్నా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ఊహాశక్తిని ప్రదర్శించారు. జోతిష్యం నమ్మాలా వద్దా అనేది వ్యక్తిగతం. ప్రస్తుతం మహేష్‌బాబు – త్రివిక్రమ్ చిత్రంతో పాటు, తమిళంలో విజయ్‌తో కలిసి ‘బీస్’్ట, హిందీలో సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీవాళి’ చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ చిత్రాలతో ఏడాది నాకు ప్రత్యేకంగా ఉండనుంది.
నెంబర్‌గేమ్ అనేది ట్రెండ్. నేను ట్రెండ్‌కు విలువ ఇవ్వను. అది మారిపోతుంటుంది. సావిత్రి, శ్రీదేవిలా ఒక క్లాసిక్ తారగా మిగిలిపోవాలని ఉంది. నాయికగా నేను నటించే పాత్రలతో మహిళలకు స్ఫూర్తినివ్వాలని
ఆశిస్తున్నా.
జీవితంలో దేన్ని పొందాలన్నా కొంత సమయం కేటాయించాలి. ప్రేమకూ సమయం ఇవ్వాలి. కానీ నా దగ్గర ఇప్పుడు ఆ టైమ్ లేదు. వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నాను.