తాను మరణించి ఐదుగురికి ప్రాణదానం
బ్రేయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను జీవన్‌దాన్ సంస్థ అవయవదానం కింద శనివారం గ్రీన్ చానల్ద్వారా మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. జీవన్‌దాన్ సంస్థ అభ్యర్థనతో జూబ్లీహిల్స్ వెళ్లే దారిలోని ట్రాఫిక్ పోలీసులంతా రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారి ఇవ్వటంతో మలక్‌పేట నుంచి జూబ్లీహిల్స్‌కు అంబులెన్స్ 22 నిమిషాల్లో చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మలక్‌పేట, మార్చి 28: బ్రేయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను జీవన్‌దాన్ సంస్థ అవయవదానం కింద శనివారం గ్రీన్ చానల్ద్వారా మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. జీవన్‌దాన్ సంస్థ అభ్యర్థనతో జూబ్లీహిల్స్ వెళ్లే దారిలోని ట్రాఫిక్ పోలీసులంతా రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారి ఇవ్వటంతో మలక్‌పేట నుంచి జూబ్లీహిల్స్‌కు అంబులెన్స్ 22 నిమిషాల్లో చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే..
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల గ్రామానికి చెందిన పి.హరీష్(25) ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉప్పల్ సమీపంలో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి ప్రమాదానికి గురికాగా, చికిత్స నిమిత్తం అతన్ని మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు బ్రేయిన్ డెడ్ అయినట్లు నిర్దారించి జీవన్‌దాన్ సంస్థకు సమాచారం అందించారు. సంస్థ ప్రతినిధులు వెంటనే మృతుని తల్లిదండ్రులను సంప్రదించి అవయవదానంపై అవగాహన కల్పించగా, హరీష్ అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించారు.
దాంతో గుండె, కాలేయం, ఊపరితిత్తులను దానం చేయగా, వారు ట్రాఫిక్ ఉన్నతాధికారులను సంప్రదించి గ్రీన్ చానల్ అవకాశం కల్పించాలని కోరారు. వారు కూడా సహకరించటంతో ఉదయం 9.23 గంటలకు అవయవాలతో మలక్‌పేట యశోద ఆసుపత్రి నుంచి అంబులెన్స్ బయలుదేరగా, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై ట్రాఫిక్ క్లియర్‌చేసి అంబులెన్స్‌కు దారి కల్పించారు. దాంతో కేవలం 22 నిమిషాల్లో అంబులెన్స్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి చేరుకుంది. తరలించిన అవయవాలతో ఐదుగురు రోగుల ప్రాణాలు కాపాడారని వైద్యులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వియత్నాంకు 40 మంది టీచర్లు.. నేటి నుంచి 17 వరకు పర్యటించనున్న బృందం
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

