కౌలాలంపూర్ : థాయ్లాండ్-కంబోడియా కాల్పుల విరమణకు అంగీకరించాయని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. ఈ ఒప్పందం బేషరతుగా, వెంటనే సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.
శాంతి చర్చల అనంతరం ఇరు దేశాల నేతలను ఆయన అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్రహీం నివాసంలో సోమవారం జరిగిన శాంతి చర్చల్లో కంబోడియా, థాయ్లాండ్ ప్రధానులిద్దరూ పాల్గొన్నారు.