హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం బస్ భవన్లోని ‘బీ-బ్లాక్’ కార్యాలయాన్ని జీఎస్టీ, ఐటీ శాఖలకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఈనెల 7న ‘బస్ భవన్ బచావో’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.
ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.7,097.38 కోట్లు ఆదాయం సమకూరినట్టు రవాణా శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 2.07% ఉన్నదని, 83.16% ఆదాయ లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపింది.