ప్రశ్నిస్తే రూ.500 ఫీజు !
నోటిఫికేషన్లు లేక.. ఉద్యోగాల భర్తీ కాక నిరుద్యోగుల ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో ఇప్పుడో కొ త్త ఫీజు వాయింపు మొదలైంది. నియామక పరీక్షల ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలకు టీజీపీఎస్సీ అధికారు లు ఫీజు విధించారు. ఒక్కో ప్రశ్నకు రూ.500 ఫీజుగా వసూలు చేస్తున్నారు. అంటే ఒక ప్రశ్నకు రూ.500, పది ప్రశ్నలకైతే రూ.5 వేలు, 20 ప్రశ్నలకు రూ.10 వేలు కట్టాల్సి ఉంటుంది. అభ్యంతరం సరైనదైతే చెల్లించిన ఫీజు తిరిగి ఇస్తారు. అభ్యంతరాలపై ఇదివరకు ఎలాంటి రుసుము ఉండేది కాదు. ఇప్పుడు ఫీజు వసూలు చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
- ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఒక్కో ప్రశ్నకు 500 కట్టాల్సిందే
- నిరుద్యోగులపై అదనపు భారం
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): నోటిఫికేషన్లు లేక.. ఉద్యోగాల భర్తీ కాక నిరుద్యోగుల ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో ఇప్పుడో కొ త్త ఫీజు వాయింపు మొదలైంది. నియామక పరీక్షల ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలకు టీజీపీఎస్సీ అధికారు లు ఫీజు విధించారు. ఒక్కో ప్రశ్నకు రూ.500 ఫీజుగా వసూలు చేస్తున్నారు. అంటే ఒక ప్రశ్నకు రూ.500, పది ప్రశ్నలకైతే రూ.5 వేలు, 20 ప్రశ్నలకు రూ.10 వేలు కట్టాల్సి ఉంటుంది. అభ్యంతరం సరైనదైతే చెల్లించిన ఫీజు తిరిగి ఇస్తారు. అభ్యంతరాలపై ఇదివరకు ఎలాంటి రుసుము ఉండేది కాదు. ఇప్పుడు ఫీజు వసూలు చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
అభ్యంతరాలు ఇంగ్లిష్లోనే
ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలను కేవలం ఇంగ్లిష్లోనే నమోదు చేయాలని టీజీపీఎస్సీ సూచించింది. తమ వాదనకు మద్దతుగా సంబంధిత ఆధారాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని, రచయిత పేరు, పుస్తకం ఎడిషన్, పేజీ నంబర్ వంటి వివరాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. ఆన్లైన్లోనే అభ్యంతరాలను వ్యక్తంచేయాలని.. ఆఫ్లైన్లో స్వీకరించబోమని కమిషన్ పేర్కొన్నది.
డిప్యూటీ ఈవో ప్రాథమిక కీ విడుదల
పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ప్రాథమిక కీని టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈ నెల 21న సాయంత్రం 5 గంటల వరకు ఒక్కో ప్రశ్నపై అభ్యంతరానికి రూ.500 చెల్లించి అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని కమిషన్ స్పష్టంచేసింది. వివరాల కోసం https://www.tgps c.gov. in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

