సూచీల వరుస ర్యాలీకి బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. వడ్డీరేట్ల పెంపు భయాలు, ప్రపంచ మార్కెట్లు మందగమన ధోరణి మధ్య మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు భారీగా నష్టపోయాయి.
- భారీగా నష్టపోయిన మార్కెట్లు
ముంబై, నవంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. వడ్డీరేట్ల పెంపు భయాలు, ప్రపంచ మార్కెట్లు మందగమన ధోరణి మధ్య మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 500 పాయింట్లు నష్టపోయి 82,031.81 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 159.45 పాయింట్లు కోల్పోయి 25,227.95 వద్ద ముగిసింది.
సూచీల్లో టైటాన్ షేరు 4.82 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు టీసీఎస్ షేరు 2.49 శాతం నష్టపోగా, బజాజ్ ఫైనాన్స్ 2.45 శాతం, ఎటర్నల్ 2.45 శాతం, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 1.97 శాతం, ఇన్ఫోసిస్ 1.86 శాతం చొప్పున పతనం చెందాయి. మరోవైపు, ఎస్బీఐ, ఐటీసీ, అలా్ర్టటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటీ ఎఫ్‌వోఎంసీ సమావేశ వివరాలు వెలువడటానికి ముందే ఫెడ్ అధికారులు వడ్డీరేట్ల పెంపునకు అనుకూలంగా చేసిన కఠిన వ్యాఖ్యలు మరిన్ని రేట్ల పెంపుల అంచనాలను బలపరిచాయని దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో అలజడి నెలకొన్నదని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పరిశోధన విభాగ అధిపతి వినోద్ నాయర్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

