ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాద ఘటనను మానవ హక్కుల సంఘం సీరియస్గా తీసుకుంది. పలు వార్త పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై సుమోటోగా కేసు స్వీకరించింది. అగ్ని ప్రమాదానికి దారితీసిన వాస్తవ పరిస్థితులు, శిశువుల మృతికి దారితీసిన కారణాలు, SNCUలో భద్రతా, నిర్వహణ ఏర్పాట్లు, ప్రమాద సమయంలో చేపట్టిన రక్షణ, వైద్య చర్యలు, అలాగే ఈ ఘటనపై నిర్వహించిన విచారణకు సంబంధించిన అంశాలను నిర్ధారించుకోవడం అవసరమని కమిషన్ భావించింది.
అందువల్ల, ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి సమర్పించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, SNCUలో భద్రత మరియు నిర్వహణ ఏర్పాట్లు, ప్రభావిత శిశువుల రక్షణ మరియు చికిత్సకు తీసుకున్న చర్యలు, అలాగే ఘటనపై నిర్వహించిన విచారణలో వెలువడిన అంశాలను నివేదికలో పొందుపరచాలని కోరింది.
ఈ వ్యవహారాన్ని తదుపరి పరిశీలన నిమిత్తం 27.10.2026కు వాయిదా వేసింది.