Terror attack : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 (IPL-2025) లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (Rajiv Gandhi International Stadium) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) మధ్య మ్యాచ్ జరగనుంది.
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ్టి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతోపాటు అంపైర్లు కూడా చేతులకు నల్ల రిబ్బన్లు ధరించనున్నారు. అంతేగాక ఉగ్రదాడిని నిరసిస్తూ మ్యాచ్‌కు ముందు ఒక నిమిషంపాటు మౌనం పాటించి మృతులకు సంతాపం తెలుపనున్నారు. అదేవిధంగా ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో చీర్ లీడర్స్‌ను పెట్టవద్దని, పటాకులు కాల్చవద్దని నిర్ణయించారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.