ఒకేసారి.. ఒకే టైటిల్‌తో.. రెండు విభిన్న భాషల్లో రూపొందుతున్న చిత్రాల అప్డేట్స్ ఒకే సమయానికి విడుదల కాబోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. దళపతి విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్స్. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మాస్ఎంటర్టైనర్ చిత్రాన్ని కల్పాతిఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు.
తెలుగులో మాత్రం ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. ఇక మరో గోట్ (గేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) సినిమా విషయానికొస్తే ఈ చిత్రంలో బబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కథానాయకుడు, దివ్యభారతి కథానాయిక. ఈ చిత్రాన్ని మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
పాగల్ చిత్ర దర్శకుడు నరేష్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే తాజాగా విజయ్ గోట్ సినిమా ట్రైలర్‌ను ఈ శనివారం సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే రోజు అదే సమయానికి సుడిగాలి సుధీర్ బాబు చిత్రం గోట్లోని ఓ లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. అయితే ఒకే పేరుతో రూపొందుతున్న రెండు చిత్రాలు ఒకే రోజు.. ఒకే సమయానికి అప్డేట్స్ ఇస్తున్నామని ప్రకటించడంతో అందరి దృష్టి గోట్ టైటిల్‌పై పడింది.
అయితే ఎక్కడా తమిళ హీరో విజయ్.. ఎక్కడా సుడిగాలి సుధీర్ అంటున్నారు కొంతమంది. అయితే ఇలా విడుదల చేయడం సుడిగాలి సుధీర్ సినిమాకు అడ్వాంటేజీ అవుతుందని చెబుతున్నారు సినీ వర్గాలు. ఏది ఏమైనా ఇది కాస్త ఇంట్రెస్టింగ్ మ్యాటర్.. సో.. ఇక విజయ్ సినిమా కూడా తెలుగులో అదే పేరుతో విడుదల కాబోతుంది. ఇక అప్పుడు టైటిల్ క్లాష్ అవాంతరాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి..