యువకుడి ఆత్మహత్యాయత్నం
అధికార పార్టీ నాయకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు పురుగులమందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం..
- అధికార పార్టీ నాయకుల వేధింపులే కారణం!
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లితండాలో ఘటన
చండ్రుగొండ, అక్టోబర్ 12 : అధికార పార్టీ నాయకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు పురుగులమందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిప్పనపల్లి తండాలో ఇటీవల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, నాటుసారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు.
దీనికి తండాకు చెందిన తేజావత్ శశాంక్ కారణమని ఆరోపిస్తూ నాటుసారా తయారుచేసే సరోజ, పార్వతి, దాసు, రంగమ్మ తదితరులు సోమవారం శశాంక్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శశాంక్ సర్పంచ్ దారావత్ రామారావు ఇంటి వద్ద పురుగుల మందుతాగాడు. ఎస్సై శివరామకృష్ణ సూచన మేరకు బాధితుడికి కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

