మందుపాతర పేలి నలుగురు
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ దాటి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులు మందుపాతర పేలి మరణించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఘటనను భారత సైన్యం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అధికార వర్గాల సమచారం ప్రకారం సోమవారం మధ్యాహ్నం పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్లో నంగి తక్రీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
- ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ దాటి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులు మందుపాతర పేలి మరణించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఘటనను భారత సైన్యం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అధికార వర్గాల సమచారం ప్రకారం సోమవారం మధ్యాహ్నం పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్లో నంగి తక్రీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. నియంత్రణ రేఖ దాటి భారత్ వైపు చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించి మందుపాతరను తాకినట్టు సమాచారం. దీంతో భారీ పేలుడు సంభవించి ఆ బృందంలోని నలుగురూ అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో లష్కరే తొయిబాకు చెందిన కీలక కమాండర్ మహమ్మద్ ఫైజాస్తో పాటు మహమ్మద్ ఇష్తియాక్, మహమ్మద్ వకాస్, మహమ్మద్ ఆసిమ్‌గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని హజీరా తహసీల్ పరిధికి చెందిన వారని సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

