భారత షట్లర్లకు కఠిన డ్రా
ప్రతిష్టాత్మక డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత షట్లర్లకు కఠిన డ్రాలు పడ్డాయి. మంగళవారం నుంచి మొదలయ్యే ఈ టోర్నీ తొలి రౌండ్లోనే పలువురు స్టార్ షట్లర్లకు చైనా ప్లేయర్లు అడ్డుగోడలా నిలబడ్డారు. మహిళల సింగిల్స్‌లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు..
- సింధు ప్రత్యర్థి అన్ సె యాంగ్
- సాత్విక్ జోడీ, లక్ష్యసేన్కూ చైనా గండం
ఒడెన్స్ (డెన్మార్క్) : ప్రతిష్టాత్మక డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత షట్లర్లకు కఠిన డ్రాలు పడ్డాయి. మంగళవారం నుంచి మొదలయ్యే ఈ టోర్నీ తొలి రౌండ్లోనే పలువురు స్టార్ షట్లర్లకు చైనా ప్లేయర్లు అడ్డుగోడలా నిలబడ్డారు. మహిళల సింగిల్స్‌లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. తొలి రౌండ్లోనే ప్రపంచ నంబర్ వన్ అన్ సె యాంగ్తో తలపడనుంది. ఈ ఏడాది జపాన్ ఓపెన్ గెలిచినా ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడలతో పాటు అర్కిటిక్ ఓపెన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన సింధు.. యాంగ్‌ను ఎలా దాటుతుందనేది ఆసక్తికరం. అదీగాక ఆమెతో ఆడిన గత పది మ్యాచ్‌లలో సింధూకు ఓటమి ఎదురైంది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్.. మూడో సీడ్ తైవాన్ షట్లర్ చౌ టైన్ చెన్‌తో ఆడనున్నాడు.
యువ సంచలనం అయూశ్ శెట్టి.. అల్వి ఫర్హాన్ (ఇండోనేషియా)ను ఢీకొనుండగా 2017లో డెన్మార్క్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన కిడాంబి శ్రీకాంత్, ఫ్రాన్స్ ఆటగాడు అర్నాడ్ మెర్కెల్‌తో ఆడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో మాజీ వరల్డ్ నంబర్ వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తొలి రౌండ్లో చైనాకు చెందిన హి జి టింగ్-రెన్ జియాంగ్ యుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఆగస్టులో ముగిసిన వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచిన మహిళల డబుల్స్ ద్వయం గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ.. మలేషియాకు చెందిన పీర్లి-తినా మురళీధరన్‌తో తొలి రౌండ్లో తలపడుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

