హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ నల్గొండ వరకు కొనసాగుతోంది. సోమవారం నాడు ఉత్తర తెలంగాణ, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ఈరోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్లిపోయింది.
గల్ఫ్‌లో సోమవారం వరకు ఉన్న తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి కూడా బలహీన పడింది.
ఈ రోజు క్రింది స్థాయి గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వస్తున్నాయి. రాష్ట్రంలో ఒకటీ లేదా రెండు చోట్ల ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.