నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 27: టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లో వచ్చే నెల 15న నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభకు టీఆర్ఎస్ క్యాడర్ సన్నద్ధమవుతున్నది. ఈ సభను విజయవంతం చేసేందుకు బుధవారం రాష్ట్రంలోని పలు ని యోజకవర్గాల్లో కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, సబితాఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొడంగల్, నాగర్‌కర్నూల్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, నారాయణపేట, భువనగిరి, వేములవాడ, నల్లగొం డ, మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ తదితర నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ విజయగర్జన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏడున్నరేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మంత్రులు, ఎమ్మెల్యేలు వివరించారు. భువనగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు వంద జన్మలెత్తినా ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయిలో ప్రజాసంక్షేమం గురించి ఆలోచించలేరని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నా రు. స్వరాష్ట్రంలో ఆకలిచావులు, ఆత్మహత్యలు తుడిచిపెట్టుకొని పోవడం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనమని చెప్పారు.
నాగర్‌కర్నూలులో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. పాత పద్ధతిలో నోటిఫికేషన్లు ఇస్తే 20 వేల ఉద్యోగాలు ఆంధ్రావారికి వెళ్తాయని, వారికి ఆ అవకాశం దక్కకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకొంటున్నారని పేర్కొన్నారు. కొడంగల్‌లో నిర్వహించిన సమావేశంలో మం త్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయశక్తి ఎదిగిందని, మరో 20 ఏండ్లు ముఖ్యమంత్రి కేసీఆరే ఉండాలని ప్రజలు కోరుకొంటున్నారని పేర్కొన్నారు. మిర్యాలగూడలో నిర్వహించిన సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఏడున్నరేండ్లలో రాష్ట్రం సా ధించిన ప్రగతి దేశానికే మార్గదర్శకమని అన్నారు. వేములవాడలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు మా ట్లాడుతూ.. నవంబర్ నెల నుంచి వేములవాడ నియోజకవర్గంలో దళితంధు పథ కం అమలుకానున్నదని తెలిపారు.