NRI | స్పెయిన్లో(Spain) తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. వేలెన్సియా నగరంలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న గీట్ల సాయి అఖిల్ రెడ్డి(30) ఆదివారం రాత్రి భవనం పైనుండి పడి మృతి చెందాడు. సాయి అఖిల్ రెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామం. ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువులకు అని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రలు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Suicide | సర్ జాబితాలో పేరు లేదని మనస్తాపం.. జైలుకు పంపుతారన్న భయంతో ఆత్మహత్య!