అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనానికి కట్టేసిన మామఅల్లుళ్ల మృతదేహాలు చెరువులో లభ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం చెరువులో సోమవారం ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వీరిద్దరు గత శనివారం కనిపించకుండా పోయినట్టు వారి కుటంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. ఇంతలోనే రెండు మృతదేహాలు చేరువులో కనిపించిన విషయాన్ని స్థానికులు తెలపడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య, హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు.