Amarnath Yatra | లాంఛనంగా అమర్నాథ్ యాత్ర షురూ.. ప్రథమపూజ చేసిన జమ్ముకశ్మీర్ గవర్నర్
Amarnath Yatra | ప్రతిష్ఠాత్మక శ్రీ అమర్నాథ్ జీ యాత్ర-2026 (Amarnath Yatra) లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం పవిత్ర గుహాలయంలో 'ప్రథమ పూజ (Pratham Puja)'ను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) ఈ కార్యక్రమంలో పాల్గొని, యాత్ర సన్నాహాలకు అధికారికంగా శ్రీకారంచుట్టారు. ఈ సందర్భంగా ఆయన మంచులింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Amarnath Yatra : ప్రతిష్ఠాత్మక శ్రీ అమర్నాథ్ జీ యాత్ర-2026 (Amarnath Yatra) లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం పవిత్ర గుహాలయంలో ‘ప్రథమ పూజ (Pratham Puja)’ను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) ఈ కార్యక్రమంలో పాల్గొని, యాత్ర సన్నాహాలకు అధికారికంగా శ్రీకారంచుట్టారు. ఈ సందర్భంగా ఆయన మంచులింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ‘ఎక్స్’ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
‘హర హర మహాదేవ్! శ్రీ అమర్నాథ్ జీ పవిత్ర గుహలో ప్రథమపూజ నిర్వహించడం నిజంగా నా అదృష్టం. ఇది వార్షిక యాత్రకు లాంఛనమైన ప్రారంభం. బాబా బర్ఫానీ ఆశీస్సులతో ప్రజలందరూ శాంతి, శ్రేయస్సు, సంపూర్ణ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించాను’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, రక్షా బంధన్ పండుగలతో ముగుస్తుంది. మొత్తం 57 రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది.
ఈ యాత్రను సురక్షితంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మనోజ్ సిన్హా తెలిపారు. ‘యంత్రాంగం, పుణ్యక్షేత్రాల బోర్డు, సైన్యం, పోలీసులు, ఇతర భద్రతా దళాలు, స్థానిక ప్రజలు, సేవా ప్రదాతలు, వాలంటీర్లు అందరూ పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందించడానికి సర్వం సిద్ధం చేశాం’ అని ఆయన భరోసా ఇచ్చారు. భారీగా మెరుగుపరిచిన మౌలిక సదుపాయాలు, అదనపు సౌకర్యాలతో యాత్రికులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.
అనంతనాగ్ జిల్లాలోని కశ్మీర్ హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3,880 అడుగుల ఎత్తులో ఈ పవిత్ర గుహ ఉంది. ఇక్కడి మంచుతో సహజసిద్ధంగా ఏర్పడే శివలింగాన్ని భక్తులు శివుని దివ్య శక్తులకు ప్రతీకగా భావిస్తారు. యాత్రికులు ప్రధానంగా రెండు మార్గాల ద్వారా గుహకు చేరుకుంటారు. సంప్రదాయ పహల్గామ్ మార్గంలో ప్రయాణానికి నాలుగురోజులు పడుతుంది. అయితే బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి వెళ్లే యాత్రికులు దర్శనం చేసుకుని అదేరోజు తిరిగి రావచ్చు.
ఈ ఏడాది యాత్రలో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది. బేస్ క్యాంపులైన పహల్గామ్, బల్తాల్ నుంచి పవిత్ర గుహకు వెళ్లే మార్గాన్ని ‘నో-ఫ్లై జోన్’గా అధికారులు ప్రకటించారు. ఈ కారణంగా ఈ యాత్రలో భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టంచేశారు. యాత్రికులు ఈ మార్పును గమనించి అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

