హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న రోస్టర్ విధానాన్ని పక్కనపెట్టి ఉద్యోగులకు పదోన్నతులివ్వ డం అన్యాయమని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం-621 ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అన్యాయాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విద్యుత్తు సౌధలో నిరసన సభను నిర్వహించిం ది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్మనోహర్, ప్రధాన కార్యదర్శి మేడి రమేశ్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవ తీసుకుని తమ రాజ్యాంగ హక్కులను రక్షించాలని కోరారు. టీవోవో-954, దాని అనుబంధ కంపెనీలు జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.